
టికెట్ దక్కలేదన్న కోపంతో పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లఘించిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. కురువ విజయ్‌కుమార్, కలీమ్ బాబాలను సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. గద్వాల నియోజకవర్గం టికెట్ కురువ విజయ్ కుమార్ టికెట్ ఆశించగా, బహదూర్‌పురా నియోజకవర్గం కలీమ్‌బాబా టికెట్ ఆశించారు.
కానీ అధిష్టానం వారికి బదులుగా మరోకరికి టికెట్ కేటాయించడంతో పార్టీపై, టీపీసీసీ చీఫ్ పై వారు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్ లో సమావేశమైన కమిటీ వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
టికెట్ల కేటాయింపు అనేది ఏఐసీసీ నింబంధనల ప్రకారం జరుగుతుందని, దీనిలో ఒక్కరి బాధ్యత ఉండదని కమిటీ తెలిపింది. టికెట్ల కేటాయింపులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్కడిదే కాదంది. దీనిలో అతని బాధ్యుడ్ని చేయడం కక్ష్యతో కూడిన చర్యగా కమిటీ భావించి ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది.