![అవయవ దానం గొప్పది : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/tpcc-working-president-jagga-reddy-hails-organ-donation-as-a-noble-act_zsAhaJTYgK.jpg)
సంగారెడ్డి టౌన్, వెలుగు: అవయవ దానం గొప్పదని, మరణం తర్వాత కూడా జీవించే అవకాశం ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి మండలం గుడి తండాలో తెలంగాణ డాక్టర్స్ క్రికెట్ లీగ్ 2025 ని ఘనంగా ప్రారంభించారు. ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ లీగ్‌ను గగన్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో సెక్రటరీ ఆనంద్ ఆధ్వర్యంలో కొనసాగింది. అవయవ దానం పట్ల అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.
అవయవ దానం చేయడం వల్ల ఇతరులకు జీవితం ఇచ్చిన వాళ్లమవుతామన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రెసిడెంట్ కిషన్, కార్యదర్శి అశోక్, కమిటీ చైర్మన్ పుల్లారావు, సంగారెడ్డి ఐఎంఏ ప్రెసిడెంట్ కిరణ్, సీనియర్ డాక్టర్లు శ్రీధర్, సురేశ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.