అధికారులు టీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నారు: రేవంత్

అధికారులు టీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నారు: రేవంత్

హైదరాబాద్:  మల్కాజ్ గిరిలో అధికార యంత్రాంగం టీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతోందని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన ఆయన.. అధికారులు  టీఆర్ఎస్ కు సహకరిస్తూ..తమ ప్రచారానికి ఆటంకాలు కల్గిస్తున్నారని అన్నారు. అనుమతి ఉన్నా తమ ప్రచార వాహనాలను అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తనకు మద్దతుగా  ప్రచారం చేయవద్దని కాంగ్రెస్ నేతలను బెదిరిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ లో చేరాలంటూ తమ పార్టీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ నేతల కదలికలపై అధికారులు నిఘా పెడుతూ..వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. మాట వినకపోతే అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. వీటిపై ఈసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు రేవంత్ రెడ్డి.