జూనియర్ కాలేజీల సమస్యలు పరిష్కరించాలి

జూనియర్ కాలేజీల సమస్యలు పరిష్కరించాలి
  • సీఎం రేవంత్​ రెడ్డికి టీపీజేఎంఏ వినతి 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల మేనేజ్ మెంట్ల సంఘం (టీపీజేఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆయన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గౌరీ సతీష్ మాట్లాడుతూ...పెండింగ్ లో ఉన్న ప్రైవేటు జూనియర్ కాలేజీల అఫిలియేషన్ పాటు స్కాలర్ షిప్​ల పెంపు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుపోయినట్టు చెప్పారు.

దీనికి సీఎం సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి సీఎంవో సెక్రటరీ, హోంశాఖ, ఫైర్ సేఫ్టీ అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లతో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సమావేశం ఏర్పాటు చేశారని వెల్లడించారు.