హనుమకొండ సిటీ, వెలుగు : టీచర్ల ప్రమోషన్ సీనియార్టీ లిస్ట్‌లో తప్పులను సవరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ కోరారు. శుక్రవారం హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. కొంతమంది టీచర్ల ర్యాంక్‌లలో తప్పులు జరిగాయని అర్జీలు పెట్టుకున్నా వాటిని సరి చేయడం లేదన్నారు.
2010 కంటే ముందు రిక్రూట్ అయిన టీచర్లను టెట్ నుంచి మినహాయించి ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి మనోజ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు జె.స్వామి, అశోక్, దినేశ్ పాషా పాల్గొన్నారు.