JioTag Go:కొత్త బ్లూటూత్ లొకేటర్ జియోట్యాగ్ గో..ఇది ఏం పనిచేస్తుంది.. ధర,ఫీచర్లు

JioTag Go:కొత్త బ్లూటూత్ లొకేటర్ జియోట్యాగ్ గో..ఇది ఏం పనిచేస్తుంది.. ధర,ఫీచర్లు

జియో కంపెనీ కొత్త బ్లూటూత్ లోకేటర్ ను ఆవిస్కరించింది. దీనిపేరు జియోట్యాగ్ గో..ఇది మొట్టమొదటి ఆండ్రాయిడ్ ట్రాకర్..ఇది గూగుల్ ఫైండ్ మై డివైజ్ నెట్ వర్క్ తో కలిసి పనిచేస్తుంది. ఈ బ్లూటూత్ లోకేటర్ ద్వారా మీ కీస్, గాడ్జెట్స్, లగేజీ, బైకులను ఎక్కడ ఉన్నా ఇట్టే కనిపెట్టొచ్చు. మీ స్మార్ట్ ఫోన్లలో Find My Device app ఇన్ స్టాల్ చేయడం ద్వారా ఈ లోకేటర్ పనిచేస్తుంది. 

ఇక ఈ లోకేటర్ ధర రూ. 1499.. అమెజాన్, జియో స్మార్ట్, రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ ట్రాకర్ బ్లాక్, ఆరెంజ్, వైట్, ఎల్లో వంటి నాలుగు కలర్లతో లభిస్తుంది. ఈ ట్రాకర్ లో సంవత్సరకాలం పనిచేసే CR2032 బ్యాటరీ ఉంటుంది. 

ఈ జియోట్యాగ్ గో లోకేటర్(ట్రాకర్)  ఫైండ్ మై డివైజ్ యాప్ కు కనెక్ట్ చేయడం ద్వారా పనిచేస్తుంది. ఇది Android 9 లేదా తర్వాత నడుస్తున్న Android స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా అందుబాటులో ఉంటుంది.బ్లూటూత్ పరిధిలో ఉన్నప్పుడు యాప్‌లోని ప్లే సౌండ్ ఫీచర్‌ను ప్రెస్ చేయడం ద్వారా ట్రాకర్ బీప్ సౌండ్‌ చేస్తుంది. తద్వారా కనిపించని వస్తువులను గుర్తించడం సులభం అవుతుంది.

ALSO READ | Elon Musk: హ్యాష్ ట్యాగ్(#)లు వేస్ట్.. X నుంచి తీసేస్తానంటున్న ఎలాన్ మస్క్..ఎందుకంటే

ట్రాకర్ బ్లూటూత్ పరిధిలో లేకున్నా కూడా Google Find My Device  నెట్ వర్క్ ని ఉపయోగించి వస్తువు ఎక్కడ ఉందో ట్రాక్ చేయొచ్చు. గెట్ డైరెక్షన్ ఆప్షన్ ద్వారా కనిపించకుండా ఉన్న వస్తువుల లోకేషన్ తెలుసుకోవచ్చు. 

జియోట్యాగ్ గో లోకేటర్ కు సిమ్ అవసరం లేదు. ఈ ట్రాకర్ లో బ్లూటూత్ 5.3 యూజర్ స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ అయి ఉంటుంది. కస్టమర్ల ఫోన్‌తో కమ్యూనికేట్ చేయడానికి ట్రాకర్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఉంటుంది. దాని కాంపాక్ట్ డిజైన్-38.2 x 38.2 x 7.2 మిమీ , కేవలం 9 గ్రా బరువు ఉంటుంది.

ఈ ఏడాది ప్రారంభంలో రిలయన్స్ జియో ఆపిల్ ఫైండ్ మై నెట్‌వర్క్‌కు Jio Tag Air ను ప్రారంభించింది. JioTag Go వలె కాకుండా JioTag Airని iPhoneలు, Android డివైజ్ లలో ఉపయోగించవచ్చు.