
జైపూర్, వెలుగు: మండల పరిధిలో టేకుమట్ల వాగు వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ, ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షెట్పల్లి, రామారావు పేట గ్రామాల్లో గోదావరినది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ, ట్రాక్టర్ పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు వెహికల్స్‌ను సీజ్‌చేసి స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రెవెన్యూ అధికారులు షెట్పల్లిలో ఇండ్ల మధలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పలను సీజ్ చేశారు. గోదావరి నది, వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వనజారెడ్డి హెచ్చరించారు.