బావిలో పడిన ట్రాక్టర్.. మహారాష్ట్రలో ఏడుగురు మృతి

బావిలో పడిన ట్రాక్టర్.. మహారాష్ట్రలో ఏడుగురు మృతి

ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో  ఘోర ప్రమాదం జరిగింది. మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు చనిపోయారు. మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హింగోలీ జిల్లా వస్మత్ తాలూకాలోని గుంజ్ గ్రామానికి చెందిన10 మంది మహిళలు.. శక్రవారం ఉదయం ఓ వ్యవసాయ క్షేత్రంలో పసుపు కోత కోసం ట్రాక్టర్లో బయలుదేరారని అధికారులు తెలిపారు. 

లింబ్‌‌గావ్ ఏరియాలోని అసేగావ్ గ్రామం వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డుపక్కనే నీటితో నిండి ఉన్న బావిలోకి దూసుకెళ్లిందని వెల్లడించారు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు, స్థానిక అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని రెస్క్యూ చేపట్టినట్లు వివరించారు. బావి నుంచి పెద్ద మొత్తంలో నీటిని పంప్ చేసి ఏడుగురు మహిళల మృతదేహాలను బయటకు తీశామన్నారు. అలాగే.. స్వల్ప గాయాలతో బయటపడిన ముగ్గురని ఆస్పత్రికి తరలించామని చెప్పారు.