ట్రాక్టర్​ ఇలా.. ట్యాంకర్​ అలా..

కౌటాల​ మండలంలోని పార్డీ పంచాయతీ పాలనకు నిదర్శనం ఈ ఫొటోలు. గ్రామాల్లో చెత్త తరలించేందుకు ఉపయోగించే ట్రాక్టర్​ను వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటున్నారు. ఓ వ్యక్తికి సంబంధించిన టేలాను ఇలా పంచాయతీ ట్రాక్టర్​లో తరలిస్తున్నారు. 

ఇక వాటర్ సప్లయ్, హరితహారం కోసం ఉపయోగించాల్సిన ట్యాంకర్​ను పది రోజులుగా ఓ రైతు మిరప నారు మడి దగ్గర నీళ్ల కోసం పెట్టారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. 

- వెలుగు, కాగజ్ నగర్