ఏరువాక సాగాలి : ఒక్క జూన్ నెలలోనే లక్ష ట్రాక్టర్లు కొన్న రైతులు

ఏరువాక సాగాలి : ఒక్క జూన్ నెలలోనే లక్ష ట్రాక్టర్లు కొన్న రైతులు

దేశ వ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.. రైతులు ఉత్సాహం ఏరువాక సాగిస్తున్నారు. పొలం దున్ని విత్తనాలు నాటటానికి జోరుగా పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. 2024, జూన్ నెలలోనే దేశ వ్యాప్తంగా ఒక లక్ష ట్రాక్టర్లు కొనుగోలు చేశారు రైతులు.. అంతేనా.. 2024 జనవరి నుంచి జూన్ నెల వరకు అంటే.. ఆరు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా 2 లక్షల 60 వేల ట్రాక్టర్ల అమ్మకాలు సాగాయి. గతంంతో పోల్చితే ఈసారి ట్రాక్టర్ల అమ్మకాలు భారీగా ఉన్నట్లు కంపెనీల డేటా చెబుతోంది. గత ఏడాది అంటే 2023తో పోల్చితే.. ఈసారి ట్రాక్టర్ అమ్మకాలు 16 శాతం పెరిగినట్లు చెబుతున్నాయి వ్యాపారవర్గాలు.

అమ్మకాల్లో మహీంద్రా ముందంజ:

2024 - 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటిదాకా 2లక్షల 60వేళా ట్రాక్టర్ల అమ్మకాలు జరగగా, వీటిలో మహీంద్రా కంపెనీ ట్రాక్టర్లు 1లక్ష 16వేలకు పైగా ఉన్నాయి. ట్రాక్టర్ల అమ్మకాల్లో మహీంద్రా కంపెనీకి చెందిన సోనాలిక, టాపే మోడళ్ళు లీడింగ్ లో ఉన్నాయి.

జూన్ నెలలోనే లక్ష ట్రాక్టర్లకు పైగా అమ్మకం:

మహీంద్రా తర్వాత ట్రాక్టర్ అమ్మకాల్లో ఎస్కార్ట్ కంపెనీ లీడింగ్ లో ఉంది. ఒక్క జూన్ నెలలోనే ఎస్కార్ట్ సంస్థ 9వేలకు పైగా ట్రాక్టర్లు విక్రయించింది. ఆ తర్వాత జాన్ డీర్ 8వేల ట్రాక్టర్లు, న్యూ హాలాండ్ 3వేల ట్రాక్టర్లు, కుబాట 16వందల ట్రాక్టర్లు, విక్రయించాయి.ఈ క్రమంలో 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్క జూన్ నెలలోనే 1లక్షకు పైగా ట్రాక్టర్ అమ్మకాలు నమోదయ్యాయి.

రుతుపవనాలు ముందుగా రావటంతో వ్యవసాయ రంగంలో జోష్:
 
మన దేశంలో రుతుపవనాలు ముందుగానే రావటం వ్యవసాయ రంగంలో జోష్ నింపిందని, రైతుల్లో సానుకూల దృక్పధాన్ని పెంచిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇది ట్రాక్టర్ అమ్మకాల్లో వృద్ధికి కారణమని చెప్పచ్చని అంటున్నారు. ఈ ఏడాది రుతుపవనాల కొరతను లానినా ప్రభావం భర్తీ చేసిందని అంటున్నారు విశ్లేషకులు.