
సంగారెడ్డి టౌన్, వెలుగు: నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని మే 20న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్,హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, నర్సింహరెడ్డి, ఏఐ టీయూసీ రాష్ట్ర నాయకుడు పావని డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్ లో కార్మిక సంఘాల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మే 28న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉందని వెల్లడించారు.
పాలకులు, కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. పని గంటలను పెంచడంతోపాటు సామాజిక భద్రత పథకాల నిధులు తగ్గించిందన్నారు. ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాల సవరణ పట్ల దృష్టిపెట్టడం లేదన్నారు. కనీస వేతనాల సవరణతోపాటు పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ యూనియన్ల నాయకులు మల్లేశం, సాయిలు, ప్రసాద్, వెంకటరాజ్యం, రాజేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సురేశ్, యాదగిరి, బాగా రెడ్డి, పాండురంగారెడ్డి, ఆంజనేయులు, అశోక్, వెంకట్, కొండల్ రెడ్డి, ప్రసన్న రావు, సుధాకర్, రాందాస్ పాల్గొన్నారు.