
అడ్డుకున్న పోలీసులు
ములుగు, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి హరీశ్‌రావును కలిసేందుకు వెళ్లిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ లీడర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జాయింట్ కన్వీనర్ ఏళ్ల మధుసూదన్, కోకన్వీనర్ గుల్లగట్టు సంజీవ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వంలో భాగమేనని, తమ సమస్యలు మంత్రికి చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవడం సరికాదన్నారు.
ఇంత నిర్బంధం పనికిరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యంతర భృతిని మంజూరు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని, పింఛన్‌దారులకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు సర్వర్ అహ్మద్, జనగాం బాబురావు, అన్నవరం రవికాంత్, మంకిడి రవి, ఎండీ.కిర్మానీ, మక్బూల్ పాషా, పాడ్య కుమార్ ఉన్నారు.