సిమెంట్‌‌‌‌ బస్తా రూ.500.. బ్లాక్ లో వ్యాపారుల దందా

జయశంకర్‌‌‌‌‌‌‌‌భూపాలపల్లి, వెలుగుగ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేసుకోవచ్చని రాష్ట్ర సర్కారు ఇటీవల కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఇటుక బట్టీలు, బ్రిక్స్, సిమెంట్, స్టీలు పరిశ్రమలు తెరుచుకోవచ్చని గురువారం కొన్ని జిల్లాల్లో ఆఫీసర్లు పత్రికా ప్రకటనలు జారీ చేశారు. కానీ శుక్రవారం వరకు జిల్లాల్లో చాలావరకు సిమెంట్, స్టీలు షాపులను ఓపెన్  చేయలేదు. కానీ అడిగినవారికి గోడౌన్ల నుంచి నేరుగా సరఫరా చేస్తున్నారు. కంపెనీల నుంచి నేరుగా మండల కేంద్రాలు, మేజర్‌‌‌‌‌‌‌‌గ్రామ పంచాయతీలకు సిమెంట్‌‌‌‌‌‌‌‌బస్తాలు సప్లయ్‌‌‌‌‌‌‌‌ అవుతాయి. గతంలో వ్యాపారులు హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌ ‌‌‌‌ధరలపై సిమెంట్‌‌‌‌‌‌‌‌బస్తాలను తీసుకొచ్చి రూ.5, రూ.10 లాభంపై అమ్మేవారు. మండల కేంద్రాల్లోని షాపుల్లో100 నుంచి 500 బస్తాల వరకు నిల్వ చేసుకొని అమ్మేవారు.  లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం కాగానే వ్యాపారులంతా తమ వద్ద ఉన్న సిమెంట్‌‌‌‌‌‌‌‌బస్తాలను బ్లాక్‌‌‌‌‌‌‌‌చేశారు. అప్పటి నుంచి అవసరమైన వారికి ఎంఆర్‌‌‌‌‌‌‌‌పీపై రూ. వంద నుంచి రూ.200 కు పైగా పెంచి అమ్ముతున్నారు. కరీంనగర్ లాంటి జిల్లాల్లో లాక్​డౌన్​కు ముందు ఓ కంపెనీకి చెందిన సిమెంట్ ఒక్కో బస్తాను రూ.300కు అమ్మగా, తాజాగా రూ.500 తీసుకుంటున్నారు. ఇక రూ.46 వేల వరకు ఉన్న టన్ను స్టీలు రూ.52 వేలకు అమ్ముతున్నారు. ప్రముఖ కంపెనీలకు చెందిన సిమెంట్ బస్తాలనైతే బ్లాక్ మార్కెట్​కు తరలించి, దొరకకుండా చేశారు. సాధారణ కంపెనీలకు చెందిన, అధిక లాభం వచ్చే సిమెంట్‌‌‌‌‌‌‌‌బస్తాలనే విక్రయిస్తున్నారు.

కొత్త స్టాక్ కోసం చర్యలు

రూరల్ ఏరియాల్లో గురువారం నుంచి సిమెంట్  కంపెనీలు ప్రారంభం కావడంతో కొత్త స్టాక్ తీసుకురావడానికి వ్యాపారులు చర్యలు ప్రారంభించారు. గతంలో సిమెంట్ కంపెనీలు స్టాక్​ సరఫరా చేసిన వారం తర్వాత బిల్లులు తీసుకునేవి. కానీ ఇప్పుడు ముందు డీడీ తీస్తేనే సిమెంట్ పంపిస్తామనే మెలిక పెట్టాయి. పాత బాకీలు సైతం చెల్లిస్తేనే డీలర్లకు సిమెంట్ ఇస్తామని చెబుతున్నాయి. ఈ క్రమంలో డీడీలు చెల్లించి సిమెంట్ తీసుకువచ్చేందుకు డీలర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. శుక్రవారం మే డే, శని, ఆదివారాలు రావడంతో సోమవారం నుంచి డీలర్లకు సిమెంట్ సరఫరా మొదలవుతుంది. అదే రోజు నుంచి  పూర్తి స్థాయిలో సిమెంట్ దుకాణాలు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి.

760 సిమెంట్ బస్తాల పట్టివేత

కాజీపేట, వెలుగు: నకిలీ పర్మిషన్​ లెటర్​తో సిమెంట్​బస్తాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వరంగల్​అర్బన్​ జిల్లా మడికొండలో జరిగింది. టాస్క్ ఫోర్స్​ సీఐ నందిరాంనాయక్ ​వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన సిమెంట్ షాపు ఓనర్​మడికొండలోని గోడౌన్ నుంచి 760 సిమెంట్​బస్తాలను తరలించేందుకు ప్రయత్నిస్తుండగా రైడ్​ చేశామన్నారు.  నిత్యావసర సరుకుల పేరిట నకిలీ పర్మిషన్​ లెటర్​ తయారు చేసుకుని బస్తాలను తీసుకెళ్లడానికి ప్లాన్​వేశారన్నారు. షాపు ఓనర్, లారీ ఓనర్, డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.