ముంబై: ట్రేడర్ల ఫోకస్ మొత్తం ఎఫ్‌ఐఐల (ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల) వైపు షిప్ట్ అయ్యింది. ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను ఎఫ్‌ఐఐల ట్రెండ్ నిర్ణయించనుంది. ఈ నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ.22,420 కోట్లను విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి విత్‌డ్రా చేసుకున్నారు. చైనా మార్కెట్, యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో పాటు గ్లోబల్ ట్రెండ్స్‌పై ట్రేడర్లు దృష్టి పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇచ్చారు.
మహారాష్ట్రలో ఓటింగ్ జరగనుండడంతో నవంబర్ 20న మార్కెట్‌కు సెలవు. నవంబర్ 23 న వెలువడే ఎన్నికల ఫలితాలు మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. యూఎస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ క్లెయిమ్స్ డేటా, మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్ పీఎంఐ డేటా, జపాన్ ఇన్‌ఫ్లేషన్ డేటా ఈ వారం విడుదల కానున్నాయి. యూఎస్‌లో ఎన్నికల తర్వాత బాండ్ ఈల్డ్‌లు పెరుగుతున్నాయని, డాలర్ బలపడుతోందని, ఇండియా వంటి ఎమర్జింగ్ మార్కెట్లకు ఇది మంచి విషయం కాదని వివరించారు. సెన్సెక్స్ కిందటి వారం 1,906 పాయింట్లు (2.39 శాతం) నష్టపోయింది.