పంజాగుట్ట,వెలుగు: ట్రాఫిక్ పోలీసులు అకస్మాతుగా వచ్చి తమ సామగ్రిని తీసుకుపోతున్నారని చిరు వ్యాపారులంతా ఎస్పార్ నగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. రోప్ పేరుతో ఎస్సార్ నగర్ ట్రాఫిక్ సీఐ సైదులు రెండు రోజులుగా ఫుట్‌పాత్‌పై వ్యాపారాలను తొలగిస్తున్నారు.
తొలుత అందరికీ సమాచారం ఇచ్చినా... ఖాళీ చేయక పోవడంతో సత్యం జంక్షన్ నుంచి మైత్రీవనం- అమీర్‌పేట్ వై జంక్షన్ నుంచి మాతా టెంపుల్ వరకు ట్రాఫిక్ ఆక్రమణలను తొలగించారు. వాటితోపాటు వివిధ వ్యాపార సంస్థలకు చెందిన ప్రచార బోర్డులను తొలగించారు. దీంతో చిరు వ్యాపారులు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడి ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఉన్నఫళంగా సామాన్లు తీసుకెళ్లి తమ పొట్ట కొడుతున్నారని వ్యాపారులు ఆందోళన చేశారు.