ఆర్మీలో ట్రేడ్స్‌‌‌‌మ్యాన్‌‌‌‌, ఫైర్‌‌‌‌మ్యాన్‌‌‌‌ ఉద్యోగాలు

ఆర్మీలో ట్రేడ్స్‌‌‌‌మ్యాన్‌‌‌‌,  ఫైర్‌‌‌‌మ్యాన్‌‌‌‌ ఉద్యోగాలు

సికింద్రాబాద్‌‌‌‌లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్‌‌‌‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్​ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో 1793 ట్రేడ్స్‌‌‌‌మ్యాన్‌‌‌‌ మేట్‌‌‌‌, ఫైర్‌‌‌‌మ్యాన్‌‌‌‌ ఖాళీల భర్తీకి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ అప్లికేషన్స్​ కోరుతోంది.

రీజియన్లు: ఈస్ట్రన్‌‌‌‌, వెస్ట్రన్‌‌‌‌, నార్తర్న్‌‌‌‌, సదరన్‌‌‌‌, సౌత్ వెస్ట్రన్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్.

అర్హతలు: ట్రేడ్స్‌‌‌‌మ్యాన్‌‌‌‌ మేట్‌‌‌‌ పోస్టులకు మెట్రిక్యులేషన్‌‌‌‌, ఐటీఐ; ఫైర్‌‌‌‌మ్యాన్‌‌‌‌ ఖాళీలకు మెట్రిక్యులేషన్‌‌‌‌ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు ట్రేడ్స్‌‌‌‌మ్యాన్‌‌‌‌ పోస్టులకు రూ.18,000 నుంచి రూ.56,900; ఫైర్‌‌‌‌మ్యాన్‌‌‌‌ ఖాళీలకు రూ.19,900 నుంచి రూ.63,200 జీతం చెల్లిస్తారు. ఫిజికల్‌‌‌‌ ఎండ్యూరెన్స్‌‌‌‌/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ద్వారా ఎంప్లాయ్‌‌‌‌మెంట్ న్యూస్‌‌‌‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి. వివరాలకు www.aocrecruitment.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.