క్రిప్టో ట్రేడింగ్ పేరుతో కోట్లల్లో మోసం

క్రిప్టో ట్రేడింగ్ పేరుతో కోట్లల్లో మోసం

హైదరాబాద్లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసిన కేటుగాళ్లు క్రిప్టో కరెన్సీ పేరుతో జనం నుంచి కోట్ల రూపాయలు దండుకున్నారు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు ఆ క్రిప్టో ట్రేడింగ్  యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు.

క్రిప్టో ట్రేడింగ్ యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే 150 రోజుల్లో 3 రెట్ల డబ్బులు చెల్లిస్తామని నిందితులు ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బును బిట్కాయిన్ కాయిన్ రూపంలో మార్చి ఇస్తామని ఆశచూపారు. చివరకు నిందితులు బిచాణా ఎత్తేయడంతో మోసపోయిన జనం ఆందోళన బాట పట్టారు. మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గనగర్ చౌరస్తా సమీపంలో సుమారు వంద మంది బాధితులు ధర్నాకు దిగారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించి క్రిప్టో ట్రేడింగ్  యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.