మైనర్లు​ డ్రైవింగ్ చేయొద్దు : ఏసీపీ శ్రీనివాసులు

మైనర్లు​ డ్రైవింగ్ చేయొద్దు : ఏసీపీ శ్రీనివాసులు

ఖమ్మం టౌన్, వెలుగు : ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లు రోడ్లపై వాహనాలు డ్రైవింగ్ చేయొద్దని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు స్టూడెంట్స్​కు సూచించారు. ఖమ్మం నగరంలో మైనర్ డ్రైవింగ్ లపై ట్రాఫిక్​ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం నగరంలోని హార్వెస్ట్​ స్కూల్​ స్టూడెంట్స్​కు ట్రాఫిక్ నిబంధనలు, మోటార్ వాహన చట్టాలపై అవగాహన కల్పించారు. 

ట్రాఫిక్  ఏసీపీ మాట్లాడుతూ ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవర్లు అధిక సంఖ్యలో పట్టుబడుతున్నట్లు చెప్పారు. ఇక నుంచి డ్రైవింగ్ చేస్తున్న మైనర్ల వాహనాలు సీజ్ చేసి, వారితో పాటు వారి తల్లిదండ్రులను న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ మోహన్ బాబు, ఆర్ఐ సాంబశివరావు, ఎస్సైలు ఉన్నారు.