మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి : ఏసీపీ శ్రీనివాసులు

మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి : ఏసీపీ శ్రీనివాసులు

ఖమ్మం టౌన్, వెలుగు : మైనర్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు సూచించారు. ఆదివారం  మైనర్లకు డ్రైవింగ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ముఖ్యకారణం చాలామంది మద్యం తాగి వాహనాలు నడపడం కాగా, మరొకటి మైనర్ల డ్రైవింగ్ అన్నారు. కొద్దిరోజులుగా విద్యార్థులు, మైనర్లు బైకులు

కార్లు నడుపుతూ వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు ఆదివారం చేపట్టిన వాహనాల తనిఖీలో 50 మంది మైనర్ డ్రైవర్లను  పట్టుకున్నామని చెప్పారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.