సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక నేపథ్యంలో ఈ నెల28న సికింద్రాబాద్‌లోని పలుమార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ కమిషర్ విశ్వప్రసాద్చెప్పారు.
28న ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. బేగంపేట, హైదరాబాద్పబ్లిక్స్కూల్, పీఎన్టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీఓ జంక్షన్, ప్లాజా, టివోలీ, సికింద్రాబాద్ క్లబ్, కార్కానా, తిరుమలగిరి క్రాస్ రోడ్స్, లోతుకుంట, బొల్లారం, రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్డైవర్షన్స్ఉంటాయని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.