తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం అడ్వైజరీ జారీ చేశారు.
గన్‌పార్క్, నాంపల్లి, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్ బండ్‌లలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నాంపల్లి టీ జంక్షన్ నుంచి రవీంద్ర భారతి వైపు వెళ్లే వాహనాలను అనుమతించకుండా ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లాలని తెలిపారు.
VVIP కాన్వాయ్ CTO జంక్షన్, ప్లాజా జంక్షన్ మీదుగా వెళ్లినప్పుడు, ట్రాఫిక్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుందని తెలిపారు. ఉదయం 10 నుండి 11 గంటల మధ్య కాన్వాయ్ దాటిన తర్వాత ముందుకు సాగడానికి అనుమతించబడుతుందని వెల్లడించారు.
రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు, రాణిగంజ్ ఆర్‌పి రోడ్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించకుండా కర్బలా జంక్షన్ వద్ద బైబిల్ హౌస్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లించనున్నారు.
ఇక్బాల్ మినార్ లిబర్టీ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లడానికి అనిమతి లేదని వారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడ, బైబిల్ హౌస్ కర్బలా జంక్షన్ వైపు వెళ్లాలని సూచించారు.
భారీ ట్రాఫిక్ రద్దీ ఉండనున్నందున ఈ జంక్షన్‌లను నివారించాలని పోలీసులు ప్రయాణికులకు సూచించారు.
- రవీంద్ర భారతి
- AR పెట్రోల్ పంప్
- ఇక్బాల్ మినార్
- Telugu Thalli Junction
- అప్పర్ ట్యాంక్ బండ్
- పాత అంబేద్కర్ విగ్రహం
- కర్బలా జంక్షన్
- బైబిల్ హౌస్
- CTO జంక్షన్
- ప్లాజా జంక్షన్
- SBI జంక్షన్
- టివోలి జంక్షన్