
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ పర్యటన, బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభ జరగనున్న పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ట్రాఫిక్ చీఫ్ సుధీర్‌బాబు శుక్రవారం విడుదల చేశారు. పోలీసులు సూచించిన రూట్లలో వాహనదారులు ట్రావెల్ చేయాలన్నారు.
ట్రాఫిక్ డైవర్షన్స్ వల్ల చిలకలగూడ క్రాస్ రోడ్స్, ఆలుగడ్డ బావి, సంగీత్, వైఎంసీఏ, ప్యాట్నీ, ప్లాజా, సీటీవో, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్ ఉపకార్ ,సికింద్రాబాద్ క్లబ్, తిరుమలగిరి క్రాస్ రోడ్స్, తాడ్‌బండ్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోయిన్ పల్లి క్రాస్ రోడ్స్, రసూల్‌పురా, బేగంపేట, ప్యారడైజ్ రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని తెలిపారు. వాహనదారులు ఇతర రూట్లలో ప్రయాణించాలన్నారు.
Also Read :- పరేడ్ గ్రౌండ్లో మోదీ సభ .. సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
ట్రాఫిక్ డైవర్షన్ ఇలా..
- టివోలీ క్రాస్ రోడ్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్‌కు వెళ్లే రూట్‌ను క్లోజ్ చేస్తారు.
- ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్, ఎస్డీ రోడ్ రూట్లలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నో ఎంట్రీ.
- పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే రూట్ రద్దీగా ఉంటుంది. ఇతర మార్గాల్లో వెళ్లాలి.
- సంగీత్ క్రాస్ రోడ్ నుంచి బేగంపేట వైపు వచ్చే వెహికల్స్‌ను వైఎంసీఏ వద్ద క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సీటీవో, రసూల్‌పురా మీదుగా బేగంపేట వైపు దారి మళ్లిస్తారు.
- బేగంపేట నుంచి సంగీత్ క్రాస్ రోడ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సీటీవో క్రాస్ రోడ్స్ వద్ద బాలంరాయి, బ్రూక్ బాండ్ టివోలి, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ జాన్స్ రోటరీ మీదుగా సంగీత్ క్రాస్ రోడ్ వైపు దారి మళ్లిస్తారు.
- బోయిన్ పల్లి, తాడ్ బండ్ వైపు నుంచి టివోలి వైపు వచ్చే వెహికల్స్‌ను బ్రూక్ బాండ్ వద్ద సీటీవో, రాణిగంజ్, ట్యాంక్ బండ్ మీదుగా దారి మళ్లిస్తారు.
- కార్ఖానా, జేబీఎస్ నుంచి ఎస్ బీహెచ్, ప్యాట్నీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను స్వీకార్ ఉపకార్ వద్ద వైఎంసీఏ, క్లాక్ టవర్, ప్యాట్నీ, టివోలీ బ్రూక్ బాండ్, బాలంరాయి, సీటీవో వైపు దారి మళ్లిస్తారు.
- ప్యాట్నీ నుంచి ఎస్ బీహెచ్, స్వీకార్ ఉపకార్ వైపు ట్రాఫిక్‌కు నో ఎంట్రీ. క్లాక్ టవర్, వైంఎసీఏ, ప్యారడైజ్, సీటీవో మీదుగా దారి మళ్లిస్తారు.
- తిరుమలగిరి ఆర్టీఏ, కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్ గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ను టివోలి వద్ద స్వీకార్ ఉపకార్, బ్రూక్ బండ్, బాలంరాయి వైపు దారి మళ్లిస్తారు.
- జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి బేగంపేట వైపు వెళ్లే వెహికల్స్‌ను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్, గ్రీన్ ల్యాండ్స్, రాజ్‌భవన్ మీదుగా దారి మళ్లిస్తారు.