Pushpa2TheRule: పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. యూసుఫ్‌గూడలో ఇవాళ (డిసెంబర్ 02) ట్రాఫిక్ ​ఆంక్షలు

Pushpa2TheRule: పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. యూసుఫ్‌గూడలో  ఇవాళ (డిసెంబర్  02) ట్రాఫిక్ ​ఆంక్షలు

‘పుష్ప–2’ (Pushpa 2) ప్రీ రిలీజ్ ఈవెంట్​ నేపథ్యంలో యూసుఫ్‌గూడలో సోమవారం(Dec2) ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈవెంట్ జరగనున్న కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యూసుఫ్‌గూడ బెటాలియన్‌, పోలీస్ లేన్‌ రూట్లలో ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్‌ చీఫ్ విశ్వప్రసాద్‌ తెలిపారు. స్టేడియానికి వచ్చే అభిమానులు జానకమ్మ తోట, సవేరా ఫంక్షన్ హాల్‌, మహ్మద్‌ ఫంక్షన్ హాల్‌ పార్కింగ్‌లో తమ వాహనాలు పార్క్‌ చేయాలని సూచించారు. వేదిక: పోలీస్ గ్రౌండ్స్, యూసుఫ్‌గూడ.

డైవర్షన్​ఇలా.. 

  • జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌ నుంచి కోట్ల విజయ భాస్కర్‌‌ రెడ్డి స్టేడియం రూట్‌లో ట్రావెల్ చేసే వాహనాలను కృష్ణానగర్ జంక్షన్‌ వద్ద శ్రీనగర్‌‌ కాలనీ, పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.  
  • మైత్రీవనం జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌, మాదాపూర్‌‌ వైపు వెళ్లే వాహనాలను యూసుఫ్‌గూడ బస్తీ వద్ద ఆర్‌‌బీవో క్వార్టర్స్‌, కృష్ణానగర్‌‌ జంక్షన్‌ మీదుగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ కు పంపిస్తారు.  
  • మైత్రీవనం జంక్షన్ నుంచి బోరబండ బస్‌ స్టాప్‌ వైపు వెళ్లే వాహనాలను సవేరా ఫంక్షన్ హాల్ వద్ద దారి మళ్లిస్తారు. కృష్ణకాంత్ పార్క్‌, జీటీఎస్ టెంపుల్,కల్యాణ్ నగర్‌‌, మోతీనగర్‌‌ మీదుగా బోరబండ బస్‌స్టాప్‌ వైపు డైవర్ట్‌ చేస్తారు.
  • బోరబండ బస్‌ స్టాప్‌ నుంచి మైత్రీవనం వైపు వెళ్లే వాహనాలను ప్రైమ్ గార్డెన్‌, కల్యాణ్‌నగర్‌‌, కల్యాణ్​నగర్​జంక్షన్‌, ఉమేశ్​చంద్ర విగ్రహం నుంచి మైత్రీవనం వైపు మళ్లిస్తారు.