కేశవాపూర్​-పెగడపల్లి దారిపై రాకపోకలు బంద్​

మహాముత్తారం, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని అటవీ గ్రామాలు జలదిగ్బంధంలో ముగినిపోయాయి. కాటారం నుంచి మేడారం వెళ్లే మెయిన్ రూట్ లో పోతుల్వాయి, కోనంపేట అలుగు వాగు, మహాముత్తారం వాగు, కేశవాపూర్​-పెగడపల్లి మధ్య పెద్దవాగు పొంగి పొర్లుతుండటంతో శనివారం సాయంత్రం రవాణా పూర్తిగా నిలిచిపోయింది. వాగుల వద్ద నీటి ప్రవాహం ప్రవహిస్తుండడంతో పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు  అప్రమత్తమై, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాకపోకలను నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. 

వాగులు ప్రవహిస్తుండడంతో పెగడపల్లి, ప్రేమ్​నగర్, బోర్లగూడెం, రేగులగూడెం, స్థంభంపల్లి(పీకే), సింగారం, కనుకునూర్, రెడ్డిపల్లి, యత్నారం, సింగంపల్లి, తాడ్వాయి మండలం మేడారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఆయా గ్రామాల ప్రజలు, వాహనాదారులు భూపాలపల్లి నుంచి కమలాపూర్, రాంపూర్ మీదుగా గమ్యాలకు చేరుకుంటున్నారు.