లక్డీకాపూల్​లో కంటైనర్​ బోల్తా.. నలుమూలలా భారీ ట్రాఫిక్ జామ్

లక్డీకాపూల్​లో కంటైనర్​ బోల్తా.. నలుమూలలా భారీ ట్రాఫిక్ జామ్

బషీర్ బాగ్ వెలుగు : లక్డీకాపూల్​లో శుక్రవారం ఉదయం 6 గంటలప్పుడు ఓ భారీ కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడింది. స్వామి మూవర్స్​కు చెందిన కంటైనర్ పేపర్ ​బండిల్స్​తో మూసాపేట నుంచి కాటేదాన్ వెళ్తుండగా లక్డీకాపూల్ ​క్రాస్​ రోడ్స్​లో డివైడర్​ను ఢీకొట్టి రోడ్డు మధ్యలో పడిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్​స్తంభించింది. ఆ ఎఫెక్ట్​ మెహిదీపట్నం, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బషీర్ బాగ్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సెక్రెటేరియట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, అసెంబ్లీ రూట్లపై పడింది. 

ఐదారు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్లు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్​ పోలీసులు భారీ క్రేన్​తో ఘటనా స్థలానికి చేరుకుని కంటైనర్​ను తొలగించారు. ట్రాఫిక్​ను క్లియర్​చేశారు. లక్డీకాపూల్– మెహిదీపట్నం రూట్​లో మధ్యాహ్నం 12 గంటల వరకు వాహనాలు నెమ్మదిగా కదిలాయి. గాయపడిన కంటైనర్ డ్రైవర్ మంగలేశ్​యాదవ్​ను పోలీసులు దగ్గర్లోని హాస్పిటల్​కు తరలించారు.