నిజామాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇందల్వాయి మండలంలో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో పోలీసులు సహాచక చర్యలు చేపట్టిన.. TSFDబృందాన్ని ఎస్సై మనోజ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
Also Read :- శ్రీరాంసాగర్ కు భారీ వరద
వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనారోగ్యానికి గురైన వారిని ట్రాక్టర్ల ద్వారా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గన్నారంతో నిజమాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాత్రి నుంచి పంచాయతీ దగ్గర నిలిపివేశారు.