హైదరాబాద్‌లో రంజాన్​ సందర్భంగా ట్రాఫిక్​ ఆంక్షలు

 హైదరాబాద్‌లో రంజాన్​ సందర్భంగా ట్రాఫిక్​ ఆంక్షలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: రంజాన్ సందర్భంగా సోమవారం సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని సిటీ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు జూ పార్క్ సమీపంలోని మీరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్ వద్ద ప్రార్థనలు జరుగుతాయన్నారు. దీంతో బహదూర్​పురా, కళాపథ్, నవాబ్ సాహెబ్ కుంట, శాస్త్రీపురం, దానమ్మ గుడిసెలు, మాసబ్ ట్యాంక్, ఎన్ఎండీసీ, ఖాజా మాన్షన్, 1/12 జంక్షన్, పీటీఐ జంక్షన్లలో రద్దీ ఉండవచ్చన్నారు. 

అటువైపు వెళ్లేవారు దీన్ని గమనించాలని కోరారు. www.facebook.com/ HYDTP .. అలాగే  ఎక్స్​లోని www.twitter.com/ HYDTPలో ట్రాఫిక్ అప్ డేట్లు తెలుసుకోవచ్చన్నారు. అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్​ను 9010203626 సంప్రదించాలన్నారు.