వరుస వానలతో రోడ్లపైకి డ్రైనేజీ, వరద నీరు
హైదరాబాద్, వెలుగు: నాన్ స్టాప్ గా కురుస్తున్న వానలతో సిటీ తడిసిముద్దవుతోంది. లోతట్టు ఏరియాలతోపాటు మెయిన్ రోడ్లపై వరద, మురుగు నిలవడం వల్ల వెహికల్స్ తో బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. బైక్ జర్నీ చేసేవారు వాటర్ లాగింగ్ పాయింట్స్‌తో అవస్థలు పడుతున్నారు. నీళ్లు నిండి గుంతలు కనిపించక సిటిజన్స్ ప్రమాదాల బారిన పడుతున్నారు. అర కిలోమీటరు జర్నీకి గంటకు తగ్గకుండా ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్నా రు.
కిందటేడు కంటే ఎక్కువ
సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కిందటేడుతో చూస్తే వాటర్ లాగింగ్స్ సంఖ్య పెరిగింది. ట్రాఫిక్ మూమెంట్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో మొత్తం 190 వాటర్ లాగింగ్స్ ఏరియాలను పోలీసులు గుర్తించారు. అందులో 45 మేజర్, 73 మీడియం, 72 మైనర్ పాయింట్స్ ఉన్నాయి. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఉన్నాయి. కొన్నిచోట్ల మోకాల్లోతు నీళ్లు నిలిచి ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ సిబ్బంది వాటిని బయటకు పంపే పనిలో పడ్డారు.
వాన పడ్డ గంట తర్వాతే ట్రావెల్
ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీస్‌కి వెళ్లే ఎంప్లాయీస్ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు.
ఉదయం, సాయంత్రం వాన పడి తగ్గిన గంట తర్వాత రోడ్లపై ట్రావెల్ చేయాలి.
సోషల్ మీడియా, ఎఫ్ ఎం రేడియో, ట్రాఫిక్ పోలీస్ యాప్స్‌లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకుంటుండాలి.
వాన నీళ్లు నిలిచే ఏరియాల్లో సైన్ బోర్డ్స్ గమనించాలి.
డ్రైనేజీ ఫ్లో ఉన్న ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఉండని వైపు డ్రైవ్ చేయాలి.
మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్
సికింద్రాబాద్ : ఆలుగడ్డ బావి, రైల్ నిలయం జంక్షన్
ఆర్ పీ రోడ్ : కార్ఖా నా మెయిన్ రోడ్ కేఎఫ్ సీ, ఆర్ పీ రోడ్ చిత్రదుర్గ, రైల్వే స్టేషన్ రోడ్ , 31 బస్టాప్, తిరుమలగిరి, బాపూజీనగర్ జంక్షన్.
పంజాగుట్ట: మొనప్ప గ్రీన్ ల్యాండ్, ఎన్ ఎఫ్ సీఎల్ ఫ్లై ఓవర్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ రాజ్ భవన్ రోడ్ , ధరమ్ కరణ్ రోడ్ , అమీర్‌పేట్ పీఎస్, మైత్రి వనం.
బేగంపేట్: యాక్సిస్ బ్యాంక్, కర్బాలా మైదాన్
సైఫాబాద్: షాదన్ కాలేజ్ , అయోధ్య జంక్షన్, మాక్స్ క్యూ ర్ హాస్పిటల్
నాంపల్లి: పోలీస్ కంట్రోల్ రూమ్
సుల్తాన్ బజార్: రంగమహల్, అఫ్జల్ గంజ్ సెంట్రల్ లైబ్రరీ
ట్యాంక్ బండ్: అప్పర్ ట్యాంక్ బండ్, లేపాక్షి
మలక్‌పేట్: అక్బర్ ప్లాజా, మలక్‌పేట్ గంజ్ , చాదర్‌ఘట్ రైల్వే ఆర్‌ఓబీ
ఎంజే మార్కెట్: ఓల్డ్ బేగంబజార్ పీఎస్
బంజారాహిల్స్: ఒమేగా హాస్పిటల్, కమాండ్ కంట్రోల్ సెంటర్, పెన్షన్ ఆఫీస్ సిగ్నల్
జూబ్లీహిల్స్: రోడ్ నం.36, క్రోమా.