మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర లారీ బీభత్సం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర లారీ బీభత్సం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్ మియాపూర్ లో లారీ భీబత్సం సృష్టించింది.మెట్రో పిల్లర్ 600 దగ్గర యూటర్న్  తీసుకుంటుండగా ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ సింహాచలం మృతి చెందగా మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి.  

స్థానికులు గాయపడ్డ  కానిస్టేబుళ్లు రాజవర్ధన్, విజేందర్ ను  ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీని పీఎస్ కు తరలించి సీజ్ చేశారు.  కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.