ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ పార్థసారథి హైదరాబాద్ లో గుండెపోటుతో చనిపోయాడు. కొన్ని రోజుల క్రితం బ్రైన్ స్ట్రోక్ కు గురైన పార్ధసారథి. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ పార్థసారథి చనిపోయాడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో యాక్టివ్ గా పాల్గొన్నారని సీనియర్ అధికారులు చెప్తున్నారు. పార్థసారథి తెలంగాణ పాటలతో ఉద్యమం స్ఫూర్తిని నింపేవారని తోటి సహచర కానిస్టేబుల్స్ గుర్తుచేసుకున్నారు.