![అచ్చం ‘పుష్ప’ పోలీస్ లా ఉన్నాడే!](https://static.v6velugu.com/uploads/2022/04/traffic-constables-srinivas-looks-like-pushpa-movie-police-officer_1wKMuHGynp.jpg)
కరీంనగర్: నిజ జీవితంలో ఎంత కష్టపడినా గుర్తింపు రాని వాళ్లు .. సోషల్ మీడియాతో రాత్రికి రాత్రే ఫేమస్ అయి పోతున్నారు. కచ్చా బాదం పాటతో వీధి వ్యాపారి ... బుల్లెట్ బండి సాంగ్ తో కొత్త పెళ్లి కూతురు ... ఇలా పాపులర్ అయినవాళ్లే. తాజాగా కరీంనగర్ కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పుష్ప సినిమాతో సోషల్ మీడియాలో పాపులరయ్యారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ... ఖాకీ ప్యాంటు, తెల్లని చొక్కా.. చేతిలో వాకీ టాకీ పట్టుకుని ట్రాఫిక్ డ్యూటీ. తలపై పూర్తి గుండు.. మూతిపై మీసకట్టు ఇతని ప్రత్యేకత. ఏడేళ్లుగా ఇదే గెటప్ తో డ్యూటీ చేస్తున్నా శ్రీనివాస్ కు ఎప్పుడూ లేని గుర్తింపు .. పుష్ప సినిమా వల్ల వచ్చింది. గతంలో బుల్లెట్ బండిపై తిరిగే ఈయన్ను అందరూ బుల్లెట్ శ్రీను అనేవాళ్లు. ఇప్పుడు అందరూ “పుష్పా.. పార్టీ లేదా?” అంటున్నారట. పుష్ప సినిమాలో పోలీసు అధికారి పాత్రలో నటించిన యాక్టర్ లా ఉండటంతో ఈయన చాలా ఫేమస్ అయ్యారు.
శ్రీనివాస్ డ్యూటీలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. మెయిన్ జంక్షన్లలో తన విచిత్రమైన సిగ్నల్స్ తో వాహనాలను కంట్రోల్ చేస్తుంటారు. పుష్పా సినిమా వచ్చినప్పటి నుంచి జనం ఈయనతో ఫోటోలు, వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెడుతున్నారు. 1992 బ్యాచ్ కు చెందిన శ్రీనివాస్ జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఎక్కువ కాలం పనిచేశారు. ఈమధ్య కరీంనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ గా బదిలీపై వచ్చారు. పోలీస్ బాస్ లు కూడా తన స్టైల్ చూసి వెరీ గుడ్ లుక్కింగ్ అంటూ అభినందిస్తున్నారని శ్రీనివాస్ చెబుతున్నారు. గుండు, మీసంతో కరీంనగర్ వాసులను ఎంటర్ టైన్ చేస్తూ.. రోజంతా ట్రాఫిక్ నియంత్రణ కోసం కష్టపడుతున్న శ్రీనివాస్ ను అందరూ అభినందిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం...