ట్రాఫిక్​ను చక్కదిద్దిన మంత్రి

ట్రాఫిక్​ను చక్కదిద్దిన మంత్రి

ముషీరాబాద్, వెలుగు: ట్యాంక్ బండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఓ కారు అదుపుతప్పి ఫుట్​పాత్​పైకి  దూసుకెళ్లింది. దీంతో పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదే టైంలో ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి యూటర్న్ తీసుకుని సెక్రటేరియెట్ వైపు వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు ఇది గమనించారు. అదుపుతప్పిన కారు దగ్గరికి వచ్చి ట్రాఫిక్ చక్కదిద్దారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది కారును అక్కడి నుంచి పక్కకు జరిపి వాహనాలు సాఫీగా వెళ్లేందుకు రోడ్ క్లియర్ చేశారు. తర్వాత  ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు దెబ్బతిన్న కారును ఠాణాకు తరలించారు.