
- నేడు ఎల్ బీ స్టేడియంలో టీఆర్ ఎస్ బహిరంగ సభ
- సాయంత్రం 4 నుం చి 9 గంటల వరకు ఆంక్షలు
- ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి
హైదరాబాద్, వెలుగు: ఎల్ బీ స్టేడియంలో శుక్రవారం టీఆర్ఎస్ బహిరంగ సభ దృష్ట్యా పోలీసులు భద్రత పర్యవేక్షణలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీఎం కేసీఆర్ , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు భారీగా హాజరవుతుండగా బషీర్ బాగ్ పరిసరాల్లో వాహనాల మళ్లింపు చర్యలు చేపడతారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సిటీ అదనపు (ట్రాఫిక్) సీపీ అనిల్ కుమార్ నోటిఫికేషన్ జారీచేశారు. వాహనాల దారి మళ్లిం పుతో పాటు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఎల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గా ల్లో వెళ్లాలని సూచిం చారు.
ఇలా ట్రాఫిక్ మళ్లింపు
ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాం పల్లి, చాపెల్ రోడ్ , రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.
అబిడ్స్, గన్‌ఫౌండ్రీ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వెహికల్స్ ను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ,చాపెల్ రోడ్ వైపు పంపిస్తారు.
బషీర్‌బాగ్ నుంచి జీపీఓ,అబిడ్స్ వైపు వెళ్లే వాహనాలు బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి హైదర్‌గూడ,కింగ్‌కోఠి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాటిని హిమాయత్ నగర్ వై జంక్షన్ వైపు అనుమతిస్తారు.
కింగ్‌కోఠి నుంచి భారతీయ విద్యాభవన్ ద్వారా బషీర్‌బాగ్ వైపు వచ్చే వెహికల్స్‌ను కింగ్‌కోఠి క్రాస్ రోడ్ నుంచి తాజ్ మహల్ లేదా ఇడెన్ గార్డెన్ వైపు మళ్లిస్తారు.
ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వాటిని లిబర్టీ, హిమాయత్ నగర్ మీదుగా పంపిస్తారు.
పార్కింగ్ పాయింట్స్
వీఐపీ వాహనాలు :- ఎస్ సీఈఆర్టీ, అగ్రికల్చర్ ఆఫీస్, మహబూబియా కాలేజ్
సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు :- ఎన్టీ ఆర్ స్టేడియం, నెక్లస్ రోడ్
ఎల్ బీనగర్, దిల్ సుఖ్ నగర్,మెహిదీపట్నం, ఓల్డ్ సిటీ వాహనాలు :- పబ్లిక్ గార్డెన్స్
ముషీరాబాద్,అంబర్ పేట్,హిమాయత్ నగర్ నుంచి వచ్చే వాహనాలు :- నిజాం కాలేజ్ గ్రౌండ్స్