Dhanush: షూటింగ్‌ కోసం ట్రాఫిక్ మళ్లింపు..ధనుష్ సినిమాపై భక్తుల మండిపాటు

Dhanush: షూటింగ్‌ కోసం ట్రాఫిక్ మళ్లింపు..ధనుష్ సినిమాపై భక్తుల మండిపాటు

డైరెక్టర్ శేఖ‌ర్ క‌మ్ముల(Sekhar Kammula)..కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసేందే. ధనుష్ 51వ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో కింగ్ నాగార్జున (Nagarjuna) విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. "DNS' అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ షురూ అయింది.

ప్రస్తుతం హీరో ధనుష్తో పాటు నటీనటులపై పలు కీలకమైన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ తిరుపతిలోని(Tirupati) అలిపిరి సమీపంలో జరుగుతుంది. ఇవాళ ఉదయం నుంచే షూటింగ్ మొదలుపెట్టడంతో..అలిపిరి వద్ద ట్రాఫిక్ భారీగా ఎర్పడింది. ఓ వైపు తిరుమలకు వెళ్లే భక్తులు, మరో వైపు షూటింగ్ జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.

శేఖ‌ర్ క‌మ్ముల టీమ్ షూటింగ్ కు పర్మిషన్ తీసుకున్నప్పటికీ..ఇలా భక్తులను ఇబ్బందికి గురి చేయడమేంటంటూ స్థానికులు మండిపడుతున్నారు. దీంతో కాసేపు స్థానికులు, భక్తులు ఇబ్బంది పడగా..స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ సమస్యని క్లియర్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

శేఖర్ కమ్ముల మరోసారి స‌మాజాన్ని ప్ర‌శ్నించేలా..సోసైటీలో అస‌మాన‌తల్ని ఎత్తి చూపుతూ త‌న‌దైన మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ గా తీర్చి దిద్దుతారనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ధనుష్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది. 

'DNS'..ధనుష్..నాగార్జున..శేఖర్ కమ్ముల..ఈ ముగ్గురి కలయికలో వస్తోన్న ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఫ్యాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు.