ఏప్రిల్​ 27 నుంచి ట్రాఫిక్​ మళ్లింపు.. ఎక్కడంటే..

ఏప్రిల్​ 27 నుంచి ట్రాఫిక్​ మళ్లింపు.. ఎక్కడంటే..

హైదరాబాద్​సిటీ, వెలుగు: మల్కాజిగిరిలోని పలు ప్రాంతాల్లో రోడ్ల రిపేర్​కారణంగా ఈ నెల 27 నుంచి మే 26 వరకు ట్రాఫిక్​ను మళ్లిస్తున్నట్టు రాచకొండ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.  గోపాల్ నగర్​ నుంచి స్ర్పింగ్​హాస్పిటల్​దారిలో పనులు జరుగుతున్నందున వాహనాలను ఈసీఐఎల్ నుంచి జెడ్​ఆర్​టీఐ సిగ్నల్స్​వరకు, లాలాపేట నుంచి తార్నాక వెళ్లే వాహనాలను రమాదేవి సిగ్నల్స్​వైపు మళ్లించనున్నట్లు పేర్కొన్నారు.

 వాహనదారులు ప్రత్యామ్నాయంగా హెచ్​బీ కాలనీ, యునాని హాస్పిటల్, జెడ్ఆర్​టీఐవై జంక్షన్​ మీదుగా జెడ్ఆర్​టీఐ సిగ్నల్, లాలాపేట, తార్నాక వైపు వెళ్లాలని సూచించారు. అలాగే, తార్నాక, లాలాపేట, జెడ్​ఆర్​టీఐ సిగ్నల్ వైపు నుంచి ఈసీఐఎల్​వైపు వెళ్లే వాహనాలను జెడ్ఆర్​టీఐ జంక్షన్ వైపు మళ్లిస్తామన్నారు. వాహనదారులు ఎన్టీఆర్​విగ్రహం, హెచ్ బీ కాలనీ, రమాదేవి సిగ్నల్ నుంచి ఈసీఐఎల్ కు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.