అలర్ట్.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

అలర్ట్.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో  ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ బడా గణేష్ తొలి పూజకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ గణేశుడిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే  ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా  ఖైరతాబాద్ వైపు వచ్చే వాహనాలను ఇతర మార్గాల వైపు దారి మళ్లించారు.

400 మంది పోలీసులతో బందోబస్తు

బందోబస్తుకు 3 షిఫ్టుల్లో 400 మంది పోలీసులు పనిచేస్తారని ట్రాఫిక్  CP విశ్వ ప్రసాద్ తెలిపారు.  ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండడం, వీకెండ్ కావడంతో   పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  తొలి రోజునే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు గవర్నర్‌ పూజలకు రానుండడంతో 24 గంటల పాటు పోలీసులు 3 షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారని తెలిపారు.  భారీ గణపతి వద్ద బందోబస్తు కోసం ముగ్గురు డీఎస్పీలు, 13 మంది ఇన్‌స్పెక్టర్లు, 33 మంది ఎస్‌ఐలు, 22 ప్లాటూన్ల సిబ్బంది  ఉంటారని చెప్పారు.

ALSO READ | వినాయకుడు వరల్డ్ వైడ్ ఫేమస్ ఎందుకంటే.?

 ట్రాఫిక్ డైవర్షన్ ఇలా..

  • ఖైరతాబాద్‌ గణపతి దర్శనం కోసం వచ్చే భక్తులు సొంత వాహనాలను తీసుకురాకపోవడం మంచిది
  •  రైల్వేగేటు నుంచి నడుచుకుంటూ వచ్చిన వారికే లోపలికి అనుమతి ..వాహనాలను అనుమతించం 
  • ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ నుంచి వచ్చిన వాళ్లు వాహనాలను ఐమాక్స్‌ పక్కనున్న పార్కింగ్‌ స్థలంలో పార్కు చేసి నడుచుకుంటూ దర్శనానికి రావాలి.
  •  మింట్‌ కాంపౌండ్‌ వైపు వచ్చే భక్తులు వాహనాలను కారు రేసింగ్‌ ప్రాంతంలో పార్కు చేసి, నడచుకుంటూ దర్శనానికి రావాలి
  •  రోడ్లపై వాహనాలను నిలిపితే సీజ్‌ చేస్తాం 
  • గణపతికి మూడు వైపులా 500 మీటర్ల వరకు నో వెండింగ్‌ జోన్‌ ఉంది
  • చిరు వ్యాపారాలకు అనుమతి లేదు