డిసెంబర్​ ​ 23 నుంచి ట్రాఫిక్​ డ్యూ టీలోకి ట్రాన్స్ జెండర్లు  

డిసెంబర్​ ​ 23 నుంచి   ట్రాఫిక్​ డ్యూ టీలోకి ట్రాన్స్ జెండర్లు  
  • 39 మందికి 15 రోజుల పాటు ట్రాఫిక్ డ్యూటీ ట్రైనింగ్
  • పనితీరు, క్రమశిక్షణతో భవిష్యత్తు
  • హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్‌‌‌‌లో నేటి నుంచి 39 మంది ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ డ్యూటీలోకి రానున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పోలీసు కమాండ్ ఆఫీస్​ ఆవరణలో ఆదివారం ట్రాఫిక్ ట్రాన్స్ జెండర్స్ తో డెమో నిర్వహించారు.

డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి  భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 39 మంది సెలెక్టెడ్  ట్రాన్స్ జెండర్లకు 15 రోజుల పాటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శిక్షణ ఇచ్చారన్నారు.  వీరిని నేటి నుంచి డ్యూటీలోకి పంపిస్తున్నామన్నారు. దీంతో సమాజంలో ట్రాన్స్ జెండర్లపై చిన్న చూపు లేకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి విప్లవత్మాకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.