పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్:  సిటీలోని ఏపీ, తెలంగాణ ప్రజలు ఓటుబాట పట్టారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఓకేసారి ఉండడంతో.. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో సొంత ఊళ్ళకు పయనమయ్యారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద అర్థరాత్రి నుంచి వాహనాలు నిలిచిపోయాయి. సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామైంది. పోలీసులు, టోల్గేట్ సిబ్బంది ట్రాఫిక్ నియంత్రిస్తున్నా.. రద్దీ మాత్రం తగ్గడం లేదు.