ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

 హసన్ పర్తి:  సాగునీటి కోసం రోడ్డు రైతులు ఎక్కారు. కమలాపూర్ మండలం శంభునిపల్లి అంబాల, శనిగరం, పెరికపల్లి, మాదన్నపేట, లక్ష్మీపురం, నేరెళ్ల, గూడూరు గ్రామాలకు  చెందిన దాదాపు 100 మంది రైతులు ఇవాళ హసన్ పర్తి మండలం అనంతసాగర్ జాతీయ రహదారి పై బైఠాయించి ఆందోళన చేశారు. ఎస్సారెస్పీ నీటిని వాగులోకు విడుదల చేయాలని నినాదాలు చేశారు.  ఎస్సారెస్పీ ఆయకట్టు కింద నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పంటలకు నీటిని విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, నీటిపారుదల శాఖ ఆఫీసర్లకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. ధర్నాతో హసన్ పర్తి-, కరీంనగర్ జాతీయ రహదారిపై  ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు చర్యలు చేపడతామని రైతులకు హసన్ పర్తి సీఐ సురేశ్ హామీ ఇచ్చారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు.