మూసాపేట్ మునిగింది.. వరదలతో పబ్లిక్ అవస్థలు

మూసాపేట్ మునిగింది.. వరదలతో పబ్లిక్ అవస్థలు

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో నగర వాసులు చిగురుటాకులా వణుకుతున్నారు. మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 

పోలీసులు ఒక్కో వాహనాన్ని అవతలిపక్కకు పంపిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కాలనీల నుంచి వరద నీరు మెట్రో స్టేషన్ కిందకి వచ్చి చేరుతుండటం ఆ నీరు డ్రైనేజీలోకి వెళ్లే మార్గం లేకపోవడంతో సమస్య ఎదురవుతోంది. 

టూ వీలర్స్ ని ఆ రూట్ లో పంపించకుండా, పెద్ద వాహనాలను ఒక్కొక్కటిగా వరద దాటిస్తున్నారు. దీంతో అమీర్ పేట నుంచి కూకట్ పల్లి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.