
అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని సొంత గ్రామాలకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరారు. దీంతో మధ్యాహ్నం, సాయంత్రం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ సిబ్బంది వాహనాలను త్వరగా పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.