అబ్దుల్లాపూర్ మెట్ – చౌటుప్పల్.. పంతంగి టోల్ గేట్ వరకు 5 కి.మీ ట్రాఫిక్ జామ్

సంక్రాంతి ఫెస్టివల్ కావడంతో సొంతూళ్లకు క్యూ కట్టారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఎక్కడ చూసినా జనం కిక్కిరిసిపోయారు. రాష్ట్ర,నేషనల్ హైవేలు వాహనాలతో నిండిపోయింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

 యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌‌ పంతంగి టోల్‌‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది.దీంతో  అబ్దులపూర్ మెంట్ నుంచి చౌటుప్పల్, పంతంగి  టోల్ గేట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 5 కి.మీ వరకు వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు  నెమ్మదిగా కదులుతున్నాయి.  

Also Read :- గంటకు అక్షరాల వెయ్యి కార్లు

రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీస్‌‌ యంత్రాంగం, టోల్‌‌ప్లాజా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పంతంగి టోల్‌‌ప్లాజా వద్ద మొత్తం 16 గేట్లు ఉండగా ఇందులో విజయవాడ వైపు 10, హైదరాబాద్‌‌ వైపు 6 గేట్ల ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. హైవేపై ట్రాఫిక్‌‌ జామ్‌‌ ఏర్పడకుండా, ప్రమాదాలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఆదివారం హైవేపై మరింత రద్దీ ఉండే అవకాశం ఉంది.