హైదరాబాద్లో భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్

 హైదరాబాద్లో భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లోని పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజా గుట్ట, బేగంపేట్,చందానగర్,   మియాపూర్,  గచ్చిబౌలి, మాదాపూర్,  సికింద్రాబాద్ లో వర్షం కురుస్తోంది.

కుత్బుల్లాపూర్ , సుచిత్ర, కొంపల్లి,దూలపల్లి,బహుదూర్ పల్లి,గండి సమ్మ, దుండిగల్, మల్లంపేట్,బౌరంపేట్,సూరారం,చింతల్,జీడిమెట్ల,షాపూర్ నగర్, గాజులరామారంలో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో గంట పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నగర వాసులు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.