హైదరాబాద్ సిటీలో ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ జాయింగ్ పోలీస్ కమిషన్ జోయెల్ డేవీస్ కీలక సూచనలు చేశారు. సిటీలో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. రానున్న రెండు రోజులు కూడా నగరంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది..సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అంతేకాకుండా నగరంలోని వివిధ ఐటీ కంపెనీలకు కూడా పలు సూచనలు చేశారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రంహోం ఇవ్వాలని కోరారు ట్రాఫిక్ జేసీపీ జోయెల్ డేవీస్. ప్రతికూల వాతావరణం లో ప్రయాణం ప్రమాదాలకు దారి తీస్తుంది.భారీ వర్షాలతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చినట్లయితే.. కొంత ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుందన్నారు.
ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు సోమవారం (సెప్టెంబర్ 2) వర్క్ ఫ్రం హోం ఇవ్వలని ట్రాఫిక్ జాయింగ్ సీపీ జోయెల్ డేవిస్ ఐటీ కంపెనీలనుద్దేశించి ఓ అడ్వైజరీ నోటీస్ విడుదల చేశారు.