డ్రగ్స్ రవాణాను అరికట్టాలి : సీపీ సునీల్ దత్

డ్రగ్స్ రవాణాను అరికట్టాలి : సీపీ సునీల్ దత్

ఖమ్మం టౌన్, వెలుగు : మాదకద్రవ్యాల దుర్వినియోగం, రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పిలుపునిచ్చారు. బుధవారం మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక  దినోత్సవం పురస్కరించుకొని మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి సహకరించాలన్నారు.

వారం రోజుల పాటు పట్టణాలు, మండలాల్లోని  పాఠశాలలు, కళాశాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.