హైడ్రా తరహాలో.. హైదరాబాద్‍లో ఫుట్‌పాత్‌లపై షాపులు నేలమట్టం

హైడ్రా తరహాలో.. హైదరాబాద్‍లో ఫుట్‌పాత్‌లపై షాపులు నేలమట్టం

సికింద్రాబాద్: హైదరబాద్ లోని నాలాలు, చెరువులను కబ్జాచేసి కట్టిన అక్రమ నిర్మాలను హైడ్రా కూల్చివేస్తుంటే.. రోడ్లపై ఫుట్‌పాత్‌లను అక్రమించి కట్టిన షాప్ లను, షెడ్లను ట్రాఫిక్ పోలీసులు కూల్చివేస్తున్నారు. మోండా మార్కెట్ లో ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా సేద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్లపై ఫుట్‌పాత్‌లను ఆక్రమించి దుకాణాలు నిర్వహిస్తున్న షెడ్లను ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో కూల్చివేశారు. మార్కెట్‌లో తిరిగే పాదాచారులకు.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఫుట్‌పాత్‌లపై ఉన్న షాప్ లను కూల్చివేశారు. పబ్లిక్ నుంచి ఫిర్యాదులు రావడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని.. ఇకనుంచి ప్రతి రోజూ అధికారుల పర్యవేక్షణ ఉంటుందని డిసిపి రాహుల్ హెగ్డే అన్నారు.

ALSO READ | మూసీ వైపు హైడ్రా కన్నెత్తి చూడలే: సీఎం రేవంత్ రెడ్డి