పెండింగ్ చలాన్లు చెల్లించేవారికి రాష్ట్ర ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 10 వరకు చలాన్లు క్లియర్ చేస్తే వెహికల్ కేటగిరీని బట్టి 60 శాతం నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఈ విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. చౌరస్తాల వద్ద రెడ్సిగ్నల్స్ పడ్డప్పుడు మైకుల్లో అనౌన్స్ చేస్తున్నారు. నిజామాబాద్ సిటీలోని ఆర్ పీ రోడ్లో సిగ్నల్ వద్ద ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్మైక్లో డిస్కౌంట్ గురించి చెప్తుండగా వెలుగు ‘క్లిక్’ మనిపించింది.
వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్