ఖమ్మం సిటీలో ర్యాష్, మైనర్ డ్రైవింగ్‌‌‌‌లపై స్పెషల్ డ్రైవ్

 ఖమ్మం సిటీలో ర్యాష్, మైనర్ డ్రైవింగ్‌‌‌‌లపై స్పెషల్ డ్రైవ్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం సిటీలో ట్రాఫిక్ ఏసీపీ ఆధ్వర్యంలో ర్యాష్, మైనర్ డ్రైవింగ్‌‌‌‌లపై ఆదివారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డ్రైవ్ లో అధిక సంఖ్యలో మైనర్లు పట్టుబడుతున్నారని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల రోడ్డుప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం మద్యం మత్తులో వాహనాలు నడపడంతోపాటు, ర్యాష్ డ్రైవింగ్ అని తెలిపారు.

మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 225 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు కాగా, 4,094 ర్యాష్, స్పీడ్ డ్రైవింగ్ కేసులు, 661 డ్రంకెన్ డ్రైవ్ కేసులు, 881 ర్యాంగ్ సైడ్ డ్రైవింగ్, 1,087 నంబర్ ప్లేట్ లేని వాహనాలపై కేసులు, 993 త్రిబుల్ రైడింగ్ కేసులు నమోదు అయినట్లు వివరించారు. ఇక నుంచి డ్రైవింగ్ చేస్తున్న మైనర్ల వాహనాలు సీజ్ చేసి, వారితో పాటు వారి తల్లిదండ్రులను న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.