వెహికల్స్ సీజ్ : స్పెక్టర్ చందర్

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నగరంలో నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న  21 వెహికల్స్ ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ చందర్, ఆర్ ఐ సతీశ్  గ్రూపులుగా ఏర్పడి ముందు, వెనక నంబర్ లేకుండా తిరుగుతున్న  61 బైక్​లను  పట్టుకున్నారు.

ప్రతి వాహనదారుడు కచ్చితంగా తన వాహనానికి నంబర్ ప్లేట్ క్లియర్ గా కనిపడే విధంగా వేసుకోవాలని సూచించారు. వెహికల్​కు సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.  నగరంలో మంగళవారం సాయంత్రం ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు.