చైనా మాంజా దారం తగిలి ట్రాఫిక్‌ పోలీస్‌కి తీవ్ర గాయాలు

హైద్రాబాద్ లో ట్రాఫిక్ పోలీస్ గా పని చేస్తున్నశివరాజ్‌ అనే వ్యక్తి ఈ మాంజా దారం కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం విధుల్లో భాగంగా నారాయణగూడ ఫ్లైఓవర్‌ నుంచి తిలక్‌ నగర్‌ రోడ్డుకు వెళ్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకుకోవడంతో  తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు బాధితుడిని చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

ALSO READ | ఎన్నిసార్లు చెప్పిన మీరు మారరా..?: బైక్‎పై వెళ్తున్న గొంతు తెంపిన చైనా మాంజా

సంక్రాంతి సెలెబ్రేషన్స్ లో పతంగులు ఎగురవేయడం వలన ఎంత మజా వస్తుందో ఆ పతంగిని ఎగురవెయ్యడానికి ఉపయోగించే చైనా మాంజా దారంతో కలిగే అనర్థాలు కూడా అన్నే ఉన్నాయి. కొందరు పతంగిని ఎగురవేసిన తర్వాత దారాలను కుడా గాల్లోకి వదిలేస్తుండటంతో రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నవారు ఇబ్బందులకి గురవుతున్నారు.